RK Mobile Unit
దేశంలో కరోనా కాలుమోపిన తరువాత ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. బీదలకు, శ్రమజీవులకు, మధ్య తరగతి వారికి జీవన వ్యయంలో అధికభాగం ఆరోగ్యంగా బ్రతకడానికి ఖర్చు చేయవలసి వస్తోంది. ఆరోగ్యశ్రీ లో కొన్ని వ్యాధులకు ఉచితంగా వైద్యం అందుతున్నా, చిన్న చిన్న బాధలకు, షుగరు, బీపి, రక్తహీనత, కీళ్ళనొప్పులు వంటి దీర్ఘకాల సమస్యలకు ప్రజలు ఆసుపత్రుల చుట్టూ తిరగవలసి వస్తోంది. పెరిగిన పెట్రోల్ ధరలతో ఆటో లేదా బస్సు చార్జీలు ఆకాశాన్ని అంటడంతో ఒకోసారి రోగి ఆసుపత్రికి చేరుకునేందుకయ్యే ఖర్చు - వైద్యునికి, వైద్యానికి అయ్యే ఖర్చుకన్నా ఎక్కువైపోతోంది! చుట్టుప్రక్కల గ్రామాలనుండి రోగితో పాటు ఇంకొకరు ఉదయాన్నే బయలుదేరి ఆసుపత్రికి చేరుకొని గంటలతరబడి ఆసుపత్రిలో వేచివుండి, డాక్టర్ కి చూపించుకుంటారు. డాక్టర్ గారు జ్వరం, బిపి, షుగరు, వంటివి చూసి, ఒకోసారి, చిన్న చిన్న పరీక్షలు చేసి, చాలాసార్లు అదే జబ్బుకి అవే మందులు రాసిస్తారు. లేదా, అవసరమైతే ఒకటిరెండు మార్చి పంపించేస్తారు.
ఇంతమాత్రానికి రోగులు ఇంత ఇబ్బంది పడాలా? ఇంతధనము, కాలము, వృధా చేయాలా? దీనికి ప్రత్యామ్నాయం లేదా? ఉందనిపించింది! గడప గడపకు అన్నీ వచ్చే ఈరోజుల్లో, వైద్యం ఎందుకు రాకూడదు? రావాలనిపించింది!
మారిన పరిస్థితుల్లో వైద్యవ్యయం తగ్గించి, ఉత్తమ చికిత్సను తక్కువ ధరకు అందించాలనే ఉద్దేశంతో, చిన్న చిన్న ఆరోగ్యసమస్యలకు నెలకొకసారో, రెండుసార్లో డాక్టర్ ని కలవవలసిన బీపీ, షుగర్ వంటి దీర్ఘకాల సమస్యలకు, మీరందరు అష్టకష్టాలుపడి ఆసుపత్రికి రావలసిన అవసరం లేకుండా మేమే మీ ఊరికి వచ్చి వైద్యం చేసేందుకు వీలుగా ఈ సంచార వైద్యకేంద్రాన్ని 30 లక్షల వ్యయంతో ఒక బస్సులో ఏర్పాటు చేశాము.
ఇందులో, రోగిని పరీక్షించడానికి, రక్తపరీక్షలు, ఇ.సి.జి. వంటివి చేయడానికి, అవసరమైన మందులు అమ్మడానికి సదుపాయాలున్నాయి.
1986 నుండి గాజువాక ప్రాంత ప్రజలకు పరిచయమున్న ఆర్.కే. హాస్పిటల్ ఈ నూతన ప్రయోగానికి నాంది పలుకుతోంది. దీన్ని మీరు విజయవంతం చేస్తారని ఆశపడుతోంది!
కనీసం నెలకొకసారైనా, ముందుగా తెలియజేసిన సమయానికి, మీ ఊరికి చేరుకుంటాము. మీ దగ్గరకు వచ్చి మీకు చేయగలిగిన వైద్యము, ఇవ్వదగిన వైద్యసలహాలు, అతి చౌకగా అందించే ప్రయత్నం చేస్తాము.
మమ్మల్ని మీ మేలు కోరేవారిగా పరిగణించి ప్రోత్సాహించాలని, అవకాశంగా వైద్యపరంగా దీన్ని ఒక భావించి మీకు మీరు మేలుచేసుకోవాలని విన్న వించుకుంటున్నాము.
మీరు గ్రహించవలసిన ముఖ్య విషయాలు:
- ఇది ఉచిత వైద్యశిబిరం కాదు.
- ఇక్కడ ఏదీ ఫ్రీగా లభించదు!
కాని, ఇక్కడ చాలా జబ్బులకు మంచి వైద్యం చౌకగా జరుగుతుంది. మీరు ఆసుపత్రికి వెళ్తే అయ్యే ఖర్చులో సగం కూడా ఇక్కడ అవ్వదు.
డాక్టర్ ఫీజులు, మీరు చేయించుకునే టెస్ట్ లూ, మీరూ కొనుకునే మందుల మీద డిస్కౌంట్ ఉంటుంది.
బీపీకి, షుగర్ వ్యాధి, కీళ్ళ నొప్పులు వంటి వ్యాధులకు మందుల ఖర్చు పెద్దగా తగ్గదుకాని, మిగతా ఖర్చులు బాగా తగ్గుతాయి.
చాలా మందికి, చాలా జబ్బులకు మందులతో సహా 500/- లోపే చికిత్స జరిగిపోతుంది!
ఈ సదవకాశానాన్ని అందిపుచ్చుకుని, మా ఈ నూతన ప్రయత్నాన్ని విజయవంతం చేస్తారని నమ్ముతూ.....
డాక్టర్. కృష్ణమూర్తి వేమూరి.
ఫిజీషియన్ & ఛైర్మన్
ఆర్ కే హాస్పిటల్, గాజువాక.